ఏపీలో ఘోరం : అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు వేధింపులతో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య

ఏపీలో ఘోరం : అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు వేధింపులతో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య

ఏపీలో పోలీసుల వేధింపులకు మరో నిండు ప్రాణం బలయ్యింది. అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నాగరాజు అనే టీడీపీ కార్యకర్త. పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైన నాగరాజును హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

తనతో పాటు తన తండ్రిని గ్రామంలోని కొందరు వ్యక్తులు తీవ్రంగా కొట్టారంటూ పదిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు నాగరాజు. తన పైన తన పిల్లల పైన రివర్స్ కేస్ పెడతానంటూ సీఐ శ్రీనివాసరావు బెదిరించాడంటూ ఆరోపించాడు నాగరాజు. సీఐతో పాటు స్టేషన్ లో సురెష్ అనే కానిస్టేబుల్ పైనా తీవ్రమైన ఆరోపణలు చేశాడు నాగరాజు.

అచ్చంపేట పోలీసుల పనితీరు పై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. లంచాల డబ్బు సైతం ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సీఐ శ్రీనివాసరావు కానిస్టేబుల్ సురేష్ లపై చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి దగ్గర నాగరాజు మృతదేహంతో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు.