
టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందతూ గురువారం రాత్రి కన్నుమూశారు. సత్యప్రభ మృతికి పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఇటీవలే ఆమె టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.2019 లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951 సెప్టెంబర్ 21న జన్మించారు.