వైసీపీ హయాంలో నో జాబ్స్... సంక్షేమం నిల్

వైసీపీ హయాంలో నో జాబ్స్... సంక్షేమం నిల్

2024 లో జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నారాలోకేష్ అన్నారు.  రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన నేతలు  ఉమ్మడి కార్యాచరణ గురించి సమావేశమయ్యారు.   విజయదశమి కలయిక మేలు కలయిక అని అన్నారు.  వైసీపీ హయాంలో దారుణాలు జరుగుతున్నాయని నారాలోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.  2014 లో జనసేన మద్దతుతో టీడీపీ, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చిందన్నారు.  వైసీపీ  ప్రభుత్వంలో బీసీ సంక్షేమాన్ని రద్దుచేసిందని.. అలాగే దళితులను హింసిస్తున్నారని లోకేష్ తెలిపారు.  వైసీపీ నేతల వేధింపులతో మైనార్టీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు నారా లోకేష్.   సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసి ఏపీ ప్రభుత్వం ... పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు.  వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు, కొత్త కంపెనీలు రాలేదన్నారు. పోరాడిన వారి గొంతు నొక్కుతున్నారని అన్నారు. 

Also Read :-  ధోని శిష్యుడికి గాయం..

తప్పుచేయని చంద్రబాబును జైల్లో పెట్టి ప్రతి పక్షాల గొంతును నొక్కుతున్నారని లోకేష్ అన్నారు. టీడీపీ, జనసేన మొదటి జేఏసీ మీటింగ్ మూడు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 1.  చంద్రబాబు అరెస్ట్ కు నిరసన 2.  ఆంధ్రప్రదేశ్ ను అరాచర పాలన నుంచి కాపాడాలని.. 3. అన్ని వర్గాలను అభివృద్ది చేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.  అలాగే ఉమ్మడి జిల్లాల్లో అక్టోబర్ 29,30,31 తేదీల్లో జనసేన, టీడీపీ జిల్లా స్థాయి కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  నవంబర్ 1 నుంచి ఇంటింటి ప్రచారం.. ఆ తరువాత  కరువు పరిస్థితుల గురించి ప్రాంతాల వారీగా నివేదిక తయారు చేయాలని పార్టీ నేతలకు లోకేష్ సూచించారు.