
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీగా అనురాధ గెలుపుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేక్ కట్ చేసి పలువురు నేతలకు తినిపించారు. తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
మిన్నంటిన సంబరాలు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి విజయాన్ని ఎంజాయ్ చేశారు. ఇటు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లోనూ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ నేతలు,