చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పొలిట్‌‌‌‌‌‌‌‌ బ్యూరో మీటింగ్‌‌‌‌‌‌‌‌

చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పొలిట్‌‌‌‌‌‌‌‌ బ్యూరో మీటింగ్‌‌‌‌‌‌‌‌
  •     ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌లో సమావేశం
  •     తెలంగాణ, ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలుగు దేశం పార్టీ పొలిట్‌‌‌‌‌‌‌‌ బ్యూరో సమావేశం హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం ఉదయం 10.-30 గంటలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందులో తెలంగాణకు సంబంధించి నాలుగు అంశాలు, ఏపీకి సంబంధించి 13 అంశాలపై చర్చించి, తీర్మానాలు చేయనున్నారు. ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల, వడగండ్ల వానలతో రైతులు నష్టపోవడం, పరిహారం ఇవ్వడంలో రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైఫల్యం, హామీల అమలులో ప్రభుత్వ విఫలంపై చర్చించనున్నారు.

అలాగే, ఇంటింటికీ తెలుగు దేశం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నారు. టీడీపీ ఏర్పడి 41 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ ప్రస్థానంతో పాటు ఎన్టీఆర్ శత జయంత్య్సువాలపై చర్చించనున్నారు. ఏపీలోని పలు సమస్యలతో పాటు 2023 మహానాడు నిర్వహణ -ప్రణాళిక తదితర అంశాలపై డిస్కస్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ పోలీట్‌‌‌‌‌‌‌‌ బ్యూరో సభ్యులు హాజరు కానున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కాసాని

ఈ నెల 29న నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించనున్నారు. దీంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సోమవారం సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని, సభకు వచ్చే వారికి పాసులు సిద్ధం చేయాలని, సభ మధ్యలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు.