14 మంది సభ్యులతో టీడీపీ పొలిటికల్ యాక్షన్‌ కమిటీ నియామకం

14 మంది సభ్యులతో టీడీపీ పొలిటికల్ యాక్షన్‌ కమిటీ నియామకం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ పొలిటికల్ యాక్షన్‌ కమిటీ నియామకమైంది. 14 మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ జనసేనతో సమన్వయం చేసుకోనుంది. ఇప్పటికే జనసేన వైపు నుంచి సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను పవన్ కళ్యాణ్ నియమించారు.

Also Read : మోదీ ప్రధాని అయ్యాక రైల్వేలో కొత్త శకం మొదలైంది : కిషన్ రెడ్డి

పొలిటికల్ యాక్షన్ కమిటీలో సభ్యులు వీళ్లే

1. యనమల రామకృష్ణుడు
2. కింజరాపు అచ్చెన్నాయుడు
3. చింతకాయల అయ్యన్నపాత్రుడు
4. ఎం.ఏ. షరీఫ్
5. పయ్యావుల కేశవ్
6. నందమూరి బాలకృష్ణ
7. నిమ్మల రామానాయుడు
8. నక్కా ఆనంద్‌బాబు
9. కాలువ శ్రీనివాసులు
10. కొల్లు రవీంద్ర
11. బీసీ జనార్థన్ రెడ్డి
12. వంగలపూడి అనిత
13. బీద రవిచంద్రయాదవ్
14. నారా లోకేష్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు పొలిటికల్ యాక్షన్ కమిటీ నియమించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, టీడీపీ కార్యక్రమాలు, రాష్ట్రంలో రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.