నేను పార్టీ మారతానని చెప్పలేదు 

నేను పార్టీ మారతానని చెప్పలేదు 

జగిత్యాల: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై రమణ స్పందించారు. టీఆర్ఎస్‌తోపాటు బీజేపీ నాయకులు తనను సంప్రదించిన మాట వాస్తమేనన్నారు. పార్టీ మార్పు గురించి తాను ఎక్కడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాల ప్రాతిపదికగా తన రాజకీయ ప్రయాణం సాగుతుందన్నారు. 

‘మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలోనే నేను పార్టీలో చేరా. పదిసార్లు బీఫాంపై పోటీచేసే అవకాశం నాకు దక్కింది. బలహీన వర్గాల అభ్యర్థిగా టీడీపీ అభివృద్ధికి నా వంతుగా కృషి చేశా. రాజకీయాల్లో ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించారు. కానీ ఇవ్వాళ రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంది. పదవుల్లో ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యే ఉన్నా. మా కార్యకర్తలతో, అనుచరులతో చర్చించా. పార్టీ మారుతానని నేను ఎక్కడా మాట్లాడలేదు. ప్రతిపాదనలతో నేను ఏనాడూ పదవులను ఆశించలేదు. టీఆర్ఎస్‌‌తో పాటు బీజేపీ కూడా నన్ను సంప్రదించిన మాట వాస్తవం. టీడీపీ మహత్తర అవకాశాలు కల్పించింది. విధానపరమైన అంశాల దృష్ట్యానే నా రాజకీయ ప్రయాణం సాగుతుంది. బాబు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఓడినా ప్రజాక్షేత్రంలో ఉంచి విశ్వాసం ఉంచారు’ అని రమణ పేర్కొన్నారు.