ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు టీడీపీ కైవసం

ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు టీడీపీ కైవసం

ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. తూర్పు రాయలసీమ స్థానం నుంచి కంచర్ల శ్రీకాంత్,  ఉత్తరాంధ్ర స్థానం నుంచి వేపాడ చిరంజీవిరావు గెలుపొందారు. 

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావుకు 82,958 ఓట్లు దక్కాయి.  వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు పడ్డాయి.  బీజేపీ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు పోలయ్యాయి.

తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో  రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌  వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డిపై విజయం సాధించారు. కంచర్ల శ్రీకాంత్‌  1,12,686 ఓట్లు సాధించగా.... శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది.