వాడకం మామూలుగా లేదు : chai GPT పేరుతో టీ స్టాల్

వాడకం మామూలుగా లేదు : chai GPT పేరుతో టీ స్టాల్

ఇండియన్స్ వాడకం మొదలుపెడితే అట్టా ఇట్టా ఉండదు.. దేన్నయినా బీభత్సంగా వాడేస్తారు.. పేరడీల్లో కానీ.. టైటిల్స్ విషయంలో కానీ ఓ అడుగు ముందే ఉంటారు.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. చాట్ జీపీటీతో నడుస్తుంది. ఈ పేరుతో ఇప్పుడు పాపులర్. దీన్ని క్యాచ్ చేసుకున్నారు మన లోకల్ బాయ్స్.. చాయ్ జీపీటీ పేరుతో టీ స్టాల్ ఓపెన్ చేశారు.. లక్షల కోట్లు ఖర్చుపెట్టి టెక్నాలజీ కనుక్కుని.. దానికి ఎంతో ముద్దుగా పేరు పెట్టుకున్నారు ఆ కంపెనీ వాళ్లు.. సేమ్ టూ సేమ్.. చాట్ ప్లేస్ లో చాయ్ పెట్టేసి.. ఫుల్ మార్కెటింగ్ చేస్తున్నాడు ఈ లోకల్ బాయ్.. సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతున్న ఈ వివరాల్లోకి వెళితే..

స్వాతి అనే ట్విట్టర్ యూజర్.. చాయ్ జీపీటీ పేరుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. సిలికాన్ వ్యాలీలో బెస్ట్ స్టార్టప్ ఐడియా అంటే ఇదే.. చాయ్ జీటీపీతో ఇండియాలో టీ షాప్.. నా కోసం టీ రెడీ చేయండి అంటూ కామెంట్ చేశారు స్వాతి. ఇక షాపు పేరు చాయ్ జీపీటీ అని ఉండగా.. నిజంగా స్వచ్ఛమైన టీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఓనర్. ఈ బ్రాండ్ తో ఫ్రాంచైజీలు ఇస్తామని ప్రకటించారు ఓనర్.

దీనిపై నెటిజన్ల వైవిధ్యంగా స్పందిస్తున్నారు. ట్రెండింగ్ ను అందిపుచ్చుకోవటంలో ఇండియన్స్ గ్రేట్ అని ఒకరు అంటే.. లోకల్ పీపుల్ ఆలోచనలు ఎంత భిన్నంగా.. ఎంత ట్రెండీగా ఉంటాయి అనటానికి ఇదో ఎగ్జాంపుల్ అంటున్నారు మరికొందరు. చాయ్ జీపీటీ ప్లగ్ ఇన్స్ ఇలా ఉంటాయి.. చాయ్ పత్తీ, పాలు అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చాయ్ జీపీటీ టీ షాపు ఎక్కడ ఉంది అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. ఫొటో పోస్ట్ చేసిన ట్విట్టర్ యూజర్ స్వాతి సైతం ఈ విషయాన్ని చెప్పలేదు. బెంగళూరు అని కొందరు అంటే.. కాదు గుర్ గ్రామ్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రాంతం ఎక్కడ అయినా.. షాపు మాత్రం ఒరిజినల్.. చాట్ జీపీటీకి పోటీగా.. కొత్త టెక్నాలజీని సృష్టించకపోవచ్చే కానీ.. చాయ్ జీపీటీతో టీ స్టాల్స్ మొత్తం వచ్చేశాయ్.. గరం గరం టీని ఎంజాయ్ చేద్దామా మనం కూడా..

Silicon valley : we have the best start-up ideas

Indian tea shops : hold my tea pic.twitter.com/1j5WtBHowF
— SwatKat? (@swatic12) May 17, 2023