
కామారెడ్డి జిల్లా మేనూర్ మోడల్ స్కూల్లో ఇండర్మియట్ చదువుతున్న విద్యార్థులను ఓ టీచర్ విచక్షణారహితంగా కొట్టింది. తెలుగు టీచర్ కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుందని, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతుండడంతో విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో.. సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు. టీచర్ భర్త ఇదేంటని ప్రశ్నించారు.
దీంతో టీచర్ విద్యార్థులను పిలిపించి ఇన్ స్టాలో పోస్ట్ చేసిందెవరని మందలించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు తప్పయిందంటూ మరొకసారి ఇలా చేయమంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ శాంతించని టీచర్ నిన్న మధ్యాహ్నం విద్యార్థులను కట్టెలు విరిగేలా కొట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన దిగారు. టీచర్ ను సస్పెండ్ చేయాంటూ నినాదాలు చేశారు.