శరీరభాగాల సూట్ తో టీచరమ్మ పాఠాలు

శరీరభాగాల సూట్ తో టీచరమ్మ పాఠాలు

పిల్లలకు పాఠాలు చెప్పడంలో ఒక్కో టీచర్ ది  ఒక్కో స్టైల్. ఎవరి స్టైల్ వారిదే . కానీ పిల్లలకు ఎక్కువగా ప్రాక్టికల్ గా చెప్తేనే పాఠాలు అర్థమవుతాయి.  మనిషికి  ఆడియో కన్నా విజువల్  ఎక్కువగా గుర్తుండి పోతుంది కాబట్టి స్పెయిన్ లో వెరోనికా అనే సైన్స్ టీచర్ ఈ ట్రిక్ నే ఫాలో అయ్యింది. శరీర నిర్మాణం గురించి పిల్లలు ఈజీగా అర్థం అయ్యిేలా అనాటమీ సూట్ వేసుకుని స్కూల్ కి వచ్చింది.  తల నుంచి కాలి వరకు  శరీర భాగాలు అన్ని సూట్ పై ముద్రించి ఉన్నాయి.  ప్రతీ అవయవం పిల్లలకు చూపెడుతూ వివరించింది టీచర్.

15 ఏళ్లుగా టీచర్ గా పనిచేస్తున్ వెరోనికి పిల్లలకు ఏది చెప్పినా ప్రాక్టికల్ గా చెప్పడం అలవాటు. అందుకే ఇలా అనాటమీ సూట్ వేసుకుని పాఠాలు చెప్పింది టీచర్.  పిల్లలకు పాఠాలు చెబుతున్న వెరోనిక ఫోటోలను ,వీడియోలను ఆమె భర్త ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇవి కాస్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు టీచర్ ను ప్రశంసిస్తున్నారు.