
బిహార్ లోని సర్కారుబడిలో ఓ టీచర్ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థితో తన కాళ్లు మసాజ్ చేయించుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడం.. ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
బిహార్ లోని కతియార్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. నాలుగో తరగతి గదిలో కుర్చీపై రిలాక్స్ అవుతూ.. ముందు టేబుల్ పై కాళ్లు పెట్టి.. నిద్రపోతున్న టీచర్… ఓ స్టూడెంట్ కు పనిష్మెంట్ ఇచ్చాడు. తన కాళ్లు మసాజ్ చేయాలని సూచించాడు. దీంతో… ఆ విద్యార్థి.. టీచర్ కాళ్లకు మసాజ్ చేశాడు. ఈ వీడియో బయటకొచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుపై దాడి చేశారు. జిల్లా విద్యాధికారికి కంప్లయింట్ చేశారు. పిల్లలను ఎంక్వైరీ చేస్తే అది నిజమే అని వాళ్లు ఒప్పుకున్నారు. ఆ టీచర్ ఇలాగే తమను ఇబ్బందిపెడుతుంటాడని విద్యార్థులు చెప్పారు. స్కూల్ లో టాయిలెట్లు క్లీన్ చేయాలని కూడా పదే పదే పనిష్మెంట్లు ఇస్తుంటాడని పిల్లలు చెప్పారు.
ఈ ఇష్యూపై శాఖపరమైన దర్యాప్తు చేస్తున్నామని జిల్లా విద్యాధికారి చెప్పారు. వివాదానికి కారణమైన టీచర్ అధికారుల ఇంటరాగేషన్ లో ఉన్నారు.