Sai Pallavi:క్లాస్ రూమ్ లో 'సారంగదరియా'

Sai Pallavi:క్లాస్ రూమ్ లో 'సారంగదరియా'

క్లాస్ రూంలో పాఠాన్ని పాటలా చెప్తే ఎలా ఉంటుంది. మీరైప్పుడైనా ఎక్స్ పీరియెన్స్ చేశారా.. ఇదే ఆలోచనతో ఓ ఉపాధ్యాయురాలు ముందుకెళ్తున్నారు. అది కూడా వయసుతో సంబంధం లేకుండా అందర్నీ ఉర్రూతలూగించిన ఓ హిట్ సాంగ్ తో.. ఇక వివరాల్లోకి వెళితే... పిల్లలకు బట్టీ పట్టి చదివే పాఠాల కన్నా.. చదువంటే భయపెట్టడం వేస్ట్ అని... చదువంటే జ్ఞానమని, దాని వల్ల కలిగే లాభాలేంటో తెలియజేయాలని ఓ టీచర్ భావించారు. అందుకే పిల్లలకు చెప్పే పాఠాలను సీరియస్ గా కాకుండా.. సినిమా పాటల రూపంలో చెబుతూ విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి వచ్చేలా, ఆసక్తిగా చదువుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఈ మేరకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా సాంగ్ పాటను పేరడీ చేసి, విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో సాంఘీక శాస్త్రంలోని భారతదేశ పటంలోని దేశాల స్థానాలను వివరిస్తూ.. "తన ఎడమ భుజం మీద నేపాల్.. దాని పైనే ఉంది చైనా.. తన కుడీ భుజం మీద పాకిస్తాన్.. దాని పైనే ఉంది అఫ్ఘానిస్తాన్.. తన కాళ్ల కింద ఉంది శ్రీలంక.. అటు పక్కనే ఉన్నాయి మాల్దీవ్స్.. తన ఆర్మ్‌పిట్‌‌లో ఉంది బంగ్లాదేశ్.. దానిపైనే ఉంది బూటాన్.." అంటూ పిల్లలకు ఈజీగా, ఇంట్రస్టింగ్ గా ఆ టీచర్ పాఠాలు చెప్పారు. ఆమె పాడడంతో పాటు అదే లిరిక్స్ తో విద్యార్థులతోనూ ఈ పాటను పాడించారు. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు. కొందరు తాము చదువుకునే రోజులను గుర్తు చేసుకుంటే.. మరికొందరేమో ఇలా చెప్తే ఎవరికైనా అర్థమవుతుందని ఆ టీచర్ ను పొగుడుతున్నారు. తాము చదువుకున్నప్పుడు కూడా ఇలాంటి టీచర్లు ఉంటే.. మాక్కూడా ఇలా పాఠాలు చెప్తే గొప్పొళ్లమయ్యేవాళ్లమని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది నెటిజన్లు.. టీచరమ్మ క్రియేటివిటీకి ఫిదా అవుతూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.