స్టూడెంట్లతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెన్షన్

స్టూడెంట్లతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్  సస్పెన్షన్

అశ్వారావుపేట, వెలుగు : స్టూడెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వర చారి సస్పెండ్  చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి ప్రైమరీ స్కూల్ లో అక్టోబర్ 30న టీచర్  మోహన్ రావు.. విద్యార్థుల బట్టలు తీయించి డాన్సులు చేయించాడు. ఈ దృశ్యాలను తన మొబైల్ లో చిత్రీకరించాడు.

ఈ విషయాన్ని స్టూడెంట్లు తమ పేరెంట్స్ కి చెప్పడంతో వారు స్కూల్  వద్ద ఆందోళన చేశారు. అనంతరం మోహన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వర చారి విచారణ చేపట్టి మోహన్ రావు పై సస్పెన్షన్  విధించారని ఎంఈఓ కృష్ణయ్య తెలిపారు.