- టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు
ఖమ్మం టౌన్, వెలుగు : టీజీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి గా ఏనుగుల సత్యనారాయణ ఎన్నో సేవలు చేశారని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. సత్యనారాయణ పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభను ఖమ్మం సిటీలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఖమ్మం జిల్లా టీజీవో అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యనారాయణ టీజీవో సంఘం వ్యవస్థాపన జరిగిన నాటి నుంచి ఎంతో క్రమశిక్షణతో కేంద్ర సంఘాన్ని నడిపించారని తెలిపారు.
కార్యక్రమంలో కేంద్ర సంఘ సభ్యుడు కొండపల్లి శేషు ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షుడు మల్లెల రవీంద్ర, ప్రసాద్, గంగవరపు నరేందర్, హౌస్ బిల్లింగ్ సొసైటీ డాక్టర్ పి.విజయ్ కుమార్, వెటర్నరీ గెజిటెడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్యం రమేశ్ బాబు, సంజయ్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు తమ్మిశెట్టి శ్రీనివాస్, ఎంపీ ఓ శాస్త్రి, అసోసియేట్ అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాసు, మెడికల్ ఫోరం బాధ్యులు నరసింహారావు పాల్గొన్నారు.
