
డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. Go317 రద్దు చేయాలని ఆందోళన చేశారు ప్రభుత్వ టీచర్లు. స్థానికత కోల్పోయి నష్ట పోతున్నాం.. భార్య పిల్లలు ఒక దగ్గర భర్త మరో చోట ఉద్యోగం చెయ్యాల్సిన పరిస్తితి ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదివింది ఎక్కడో..ఉద్యోగం అక్కడే అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న టీచర్లను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.