కొత్తగూడ, వెలుగు: విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించేలా టీచర్లు కృషి చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్పేర్కొన్నారు. మంగళవారం ఆమె కొత్తగూడలోని సీయూపీఎస్ స్కూల్లో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో పాల్గొని టీచర్లకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఈవో మందుల శ్రీరాములు, వెల్ఫేర్ ఆఫీసర్ శిరీష, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో అనురాధ, ఎంఈవో లక్ష్మీనారాయణ ఉన్నారు.
