రెండేళ్లుగా ‘టెట్ ’ వెయిటింగ్…

రెండేళ్లుగా ‘టెట్ ’ వెయిటింగ్…

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ )కి గ్రహణం పట్టింది. ఈ టెస్ట్ ని రెండేళ్లుగా నిర్వహించట్లేదు. ప్రభుత్వం ఓ వైపు టీచర్ రిక్రూట్​మెంట్​ టెస్ట్ (టీఆర్‌‌టీ) ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఓకే చెప్పేసింది. మరో వైపు బీసీ రెసి డెన్షియల్స్ లో పోస్టుల
భర్తీకి చర్యలు తీసుకుంటోంది. ఆ జాబులకు అప్లయ్ చేయాలంటే టెట్​లో క్వాలిఫై కావటం కంపల్సరీ . అంత కీలకమైన పరీక్షకు టీఆర్ ఎస్ గవర్నమెంట్​ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణలో కలిపి ఆరుసార్లు టెట్‌ నిర్వహించారు. ఈ పరీక్షలో ఒకసారి అరత్హ సాధిస్ తే ఏడేళ్లపాటు చెల్లు బాటవుతుంది. అయితే.. ఆరు టెట్లలో మొదటి మూడింటి వ్యాలిడిటీ ఇప్పటికే ముగిసింది. పైగా తెలంగాణలో టెట్‌ పెట్టి ఈమధ్యే రెండేళ్లు పూర్తయ్యింది. అయినప్పటి కీ ఆ టెస్ట్ విషయాన్ని విద్యా శాఖ పట్టించుకోవట్లేదు.

ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టకుండానే రెసి డెన్షియల్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్‌‌ జారీ చేస్తారేమోనని ఆందోళన చెం దుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్​ ఇటీవల టీఆర్‌‌టీ ద్వారా 1,698 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌‌ తర్వాత మరోసారి టీఆర్‌‌టీ ఉంటుం దో ఉండదో తెలియని పరిస్థితి. దీంతో అభ్యర్థులు ప్రిపరేషన్ లో ఉన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మొదటి మూడు టెట్లలో అర్హత సాధించి న రెండు లక్షల మంది అభ్యర్థులు ఆ వ్యాలిడిటీని కోల్పోయారు. వాళ్లందరూ ఇప్పుడు మరోసారి టెట్​ రాసి క్వాలిఫై కావాలనుకుంటు న్నారు.

సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌‌జీటీ) పోస్టులకు బీఎడ్‌‌ పాసైనవారు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది. ఆ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలంటే టెట్‌ లోని పేపర్‌‌–-1లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీంతో బీఎడ్‌‌ చేసి గతంలో టెట్‌ లోని పేపర్‌‌–-2లో క్వాలిఫై అయినవారూ ఇప్పుడు టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ‘విద్యాహక్కు చట్టం2009’ ప్రకారం ఆరు నెలలకోసారి జాతీయ స్థాయిలో సీటెట్‌ , స్టేట్​ లెవల్లో టెట్‌ పెట్టాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో అది సజావుగానే అమలైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఏడాదికోసారి టెట్​ పెట్టేలా ప్రభుత్వం ఉత్తర్వు లిచ్చింది. ఆ జీవో ప్రకారం 2016 మేలో, రెండోసారి 2017లో రెండు సార్లు పరీక్ష నిర్వహించి , గత రెండేళ్ల నుంచి మానేశారు. ఈ రెండేళ్లలో బీఎడ్‌‌, డీఎడ్‌‌ పాసైనవారు కనీసం 50 వేలకు పైనే ఉంటారు. ఇప్పటి కే టెట్‌ వ్యాలిడిటీ కోల్పోయినవారు, కొత్తగా టీచర్ ట్రైనింగ్ కోర్సులు పూర్తిచేసుకు న్నవారు సుమారు 2 లక్షల 30 వేల మంది వరకు ఉన్నారు. వీళ్లంతా టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.