సూర్య రెండో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే

సూర్య రెండో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్  ఐసీసీ మెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన  రెండో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో ట్రావిస్ హెడ్ 844 రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. సూర్య 821 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.  

జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సత్తా చాటుతున్న ఇండియా బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రుతురాజ్ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13 స్థానాలు మెరుగై ఏడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4 ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మెరుగై 39వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకోగా.. షార్ట్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ 75వ స్థానంలో నిలిచాడు.