
టీమిండియా బౌలర్ నటరాజన్(30) గత నెలలో మోకాలికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటరాజన్ గాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలిపాడు. తన ఫిట్‌నెస్ కు సంబంధించిన వీడియోను ఆదివారం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. నట్టూ ప్రస్తుతం తన ఇంట్లోనే ఉన్నాడు. నేను రోజురోజుకీ ధృఢంగా తయారవుతున్నా నంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా రీహాబ్, ప్రొగ్రెస్ అనే రెండు హ్యాష్ ట్యాగ్‌లను జోడించాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన నటరాజన్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.