టీంఇండియా జట్టు లాంగ్‌‌‌‌‌‌‌‌ టూర్​కు లైన్‌‌‌‌‌‌‌‌ క్లియర్

టీంఇండియా జట్టు లాంగ్‌‌‌‌‌‌‌‌ టూర్​కు లైన్‌‌‌‌‌‌‌‌ క్లియర్
  • జట్టుకు లైన్‌ క్లియర్.. నేడు ముంబైకి క్రికెటర్లు
  • తమ హోమ్‌‌ టౌన్స్‌‌ నుంచి స్పెషల్‌‌ ఫ్లైట్స్‌‌లో ప్లేయర్ల రాక
  • రాహుల్‌‌‌‌ ఫిట్.. సాహాకు నెగెటివ్
  • 24న బయో బబుల్‌‌లోకి ఎంట్రీ.. 2న ఇంగ్లండ్‌‌కు పయనం

వృద్ధిమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాహా కరోనా నుంచి కోలుకున్నాడు. అపెండిసైటిస్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేయించుకున్న లోకేశ్​ రాహుల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు.  యూకే టూర్​కు వెళ్లనున్న టీమిండియా క్రికెటర్లు ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్​ కానున్నారు. ఇందుకోసం ప్లేయర్లంతా బుధవారం ముంబైకి చేరుకుంటున్నారు. వివిధ నగరాల్లో ఉన్న  ప్లేయర్లను ఒక్క చోటుకు తెచ్చేందుకు బీసీసీఐ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసింది. ప్లేయర్లు, సపోర్ట్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌.. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి ముంబై చేరుకున్నాక.. ఈ నెల 24  నుంచి హార్డ్‌‌‌‌‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌‌‌‌‌లో ఉంటారు. ఈలోపు రెండు ఆర్టీపీసీఆర్​ టెస్టుల్లో నెగెటివ్‌‌‌‌‌‌‌‌ రిపోర్టు వస్తేనే బబుల్‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ లభిస్తుంది. క్వారంటైన్‌‌‌‌‌‌‌‌ ముగిశాక జూన్‌‌‌‌‌‌‌‌ రెండో తేదీన స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో బయలుదేరి తర్వాతి రోజు యూకేలో ల్యాండ్‌‌‌‌‌‌‌‌ అవుతారు.  మరోవైపు ట్రావెల్‌‌‌‌‌‌‌‌ రిస్ట్రిక్షన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి యూకే గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ టీమిండియాకు మినహాయింపు ఇచ్చింది. దాంతో, మూడు నెలల లాంగ్‌‌‌‌‌‌‌‌ టూర్​కు లైన్‌‌‌‌‌‌‌‌ క్లియర్ అయింది. 

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం యూకే వెళ్లనున్న టీమిండియాకు గుడ్‌‌‌‌‌‌‌‌న్యూస్. స్టార్​ క్రికెటర్​లోకేశ్​ రాహుల్,  సీనియర్​ వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్​ వృద్ధిమాన్‌‌‌‌‌‌‌‌ సాహా ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ఎక్కేందుకు రెడీ అయ్యారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా అపెండిసైటిస్‌‌‌‌‌‌‌‌ రావడంతో సర్జరీ చేయించుకున్న కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా కోలుకొని ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. మరోవైపు కరోనా బారిన పడిన సాహా రికవర్ అయ్యాడు. దాంతో, ఇద్దరూ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండనున్నారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌కు ఆడిన సాహా లీగ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా వైరస్‌‌‌‌‌‌‌‌ బారిన పడ్డాడు. అప్పటి నుంచి ఢిల్లీలోని ఓ హోటల్‌‌‌‌‌‌‌‌లో ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సాహా.. రెండున్నర వారాల తర్వాత నెగెటివ్​ రిపోర్ట్​తో  కోల్​కతాలోని తన ఇంటికి వెళ్లాడని తెలుస్తోంది. మరో ఆర్టీపీసీఆర్​ టెస్టులో నెగెటివ్‌‌‌‌‌‌‌‌ వస్తే అతను ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌‌‌‌‌‌‌‌లో మిగతా టీమ్‌‌‌‌‌‌‌‌తో కలవనున్నాడు. మరోవైపు పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్.. సర్జరీ తర్వాత రికవర్​ అయి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ కూడా సాధించినట్టు సమాచారం. బుధవారం తన కర్నాటక స్టేట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌మేట్, బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్ మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌తో కలిసి ముంబైకి ప్రయాణం కానున్నాడు. వచ్చే నెల 18వ తేదీన సౌతాంప్టన్‌‌‌‌‌‌‌‌లో మొదలయ్యే వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనున్న కోహ్లీసేన తర్వాత ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌ ఆడనుంది.

మూడు సిటీల నుంచి స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌‌‌‌‌
ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 14 ఆగిన తర్వాత టీమిండియా క్రికెటర్లంతా తమ సొంత నగరాలకు వెళ్లిపోయారు. అయితే, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్​కు సెలెక్ట్ అయిన 24 మంది ప్లేయర్లను ముంబైకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ కేవలం మూడు సిటీల నుంచి స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌‌‌‌‌ అరేంజ్‌‌‌‌‌‌‌‌ చేసింది.  హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నుంచి ఏర్పాటు చేసిన చార్టెడ్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌‌‌‌‌లో క్రికెటర్లు ముంబై రానున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి బయలుదేరే ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో  పేసర్​ మహ్మద్ సిరాజ్‌‌‌‌‌‌‌‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ ఆర్. శ్రీధర్​ ప్రయాణించనున్నాడు. మరో హైదరాబాదీ హనుమ విహారి కౌంటీ క్రికెట్ కోసం ఇప్పటికే యూకేలో ఉన్నాడు. ఇక, చెన్నై నుంచి వెళ్లే విమానంలో లోకేశ్ రాహుల్, మయాంక్‌‌‌‌‌‌‌‌, రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్​ ప్రయాణం చేస్తారు. బెంగళూరు బేస్‌‌‌‌‌‌‌‌గా ఉంటున్న రాహుల్, మయాంక్  రోడ్డు మార్గంలో చెన్నై చేరుకొని ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ అందుకుంటారు. ఇక, ఢిల్లీ నుంచి మూడో ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ బయలుదేరుతుంది. ఇందులో రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్​, శుభ్​మన్‌‌‌‌‌‌‌‌ గిల్, ఉమేశ్​ యాదవ్, ఇషాంత్‌‌‌‌‌‌‌‌ శర్మ, స్టాండ్‌‌‌‌‌‌‌‌ బై ప్లేయర్లు​ అవేశ్​ ఖాన్‌‌‌‌‌‌‌‌, అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌‌‌‌‌  వస్తారు. ప్రస్తుతం డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఈశ్వరన్, లక్నోలో ఉన్న ఇషాంత్‌‌‌‌‌‌‌‌ ముందుగా ఢిల్లీకి వచ్చి ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. మిగతా వారిలో గుజరాత్‌‌‌‌‌‌‌‌కు చెందిన చతేశ్వర్​ పుజారా, రవీంద్ర జడేజా, అక్షర్​ పటేల్, అర్జాన్‌‌‌‌‌‌‌‌ నాగ్వాస్‌‌‌‌‌‌‌‌వాలా రోడ్డు మార్గంలో ముంబై చేరుకుంటారు. అర్జాన్‌‌‌‌‌‌‌‌ కోసం బోర్డు కారు ఏర్పాటు చేసిందని సమాచారం. అలాగే,  జడేజా ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, కోల్‌‌‌‌‌‌‌‌కతా బేస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు మహ్మద్‌‌‌‌‌‌‌‌ షమీ, వృద్ధిమాన్ సాహా కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌‌‌‌‌లో జర్నీ చేయనున్నారు. షమీ బుధవారమే ముంబై చేరుకోనుండగా.. కరోనా నుంచి కోలుకున్న సాహాకు ఈ నెల 24వ తేదీలోపు బబుల్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేందుకు బీసీసీఐ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. వివిధ సిటీల నుంచి ముంబై చేరుకున్న ప్లేయర్లు, నిర్దేశిత హోటల్స్‌‌‌‌‌‌‌‌లో ఉంటారు. ప్లేయర్లు, స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ కోసం రెగ్యులర్​ డోర్​స్టెప్‌‌‌‌‌‌‌‌ కరోనా టెస్టుల కోసం బోర్డు ఏర్పాట్లు చేసింది. బయో బబుల్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరైన తర్వాత కూడా రెగ్యులర్​గా టెస్టులు కండక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ అనుభవం దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో  బబుల్‌‌‌‌‌‌‌‌లోకి కరోనా ఎంటర్​ అవకుండా బోర్డు పూర్తి అప్రమత్తంగా ఉంది.

ముంబై ప్లేయర్లు ఐదో రోజుల తర్వాతే
ఇక, ముంబై బేస్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు బయో బబుల్‌‌‌‌‌‌‌‌లో చేరేముందు మరో ఐదు రోజులు తమ ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌తో స్పెండ్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, అజింక్యా రహానె, జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా, శార్దూల్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్​తో పాటు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్​ రెండు నెగెటివ్‌‌‌‌‌‌‌‌ రిపోర్టులతో ఈ నెల24న నేరుగా బబుల్‌‌‌‌‌‌‌‌లో జాయిన్‌‌‌‌‌‌‌‌ అవుతారు. ఈ ఐదు రోజుల పాటు తమ ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉండాలని వారికి బోర్డు సూచించింది.

ట్రావెల్‌‌‌‌‌‌‌‌ రిస్ట్రిక్షన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి మినహాయింపు
కరోనా నేపథ్యంలో ఇండియాను యూకే గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ తమ ట్రావెల్‌‌‌‌‌‌‌‌ రెడ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో చేర్చింది. అయితే, మూడు నెలల లాంగ్‌‌‌‌‌‌‌‌ టూర్​ కోసం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ వెళ్లనున్న టీమిండియాకు దీని నుంచి మినహాయింపు ఇచ్చేందుకు బీసీసీఐ చేసిన ప్రయత్నాలు సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ట్రావెల్‌‌‌‌‌‌‌‌ రిస్ట్రిక్షన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి మన టీమ్‌‌‌‌‌‌‌‌కు యూకే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వచ్చే నెల 3న యూకే చేరనున్న టీమ్.. సౌతాంప్టన్‌‌‌‌‌‌‌‌లోని హోటల్స్‌‌‌‌‌‌‌‌లో క్వారంటైన్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌కు కూడా గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ లభించే చాన్సుంది. కాగా, ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌కు మినహాయింపు అంశం ఇంకా చర్చల  దశలో ఉంది.

యూకేలో సెకండ్​ డోస్​
టీమిండియా క్రికెటర్లకు కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్‌‌‌‌ ఇచ్చేందుకు యూకే హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. తమ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకారం ప్లేయర్లందరికీ వ్యాక్సిన్ అందజేస్తామని హెల్త్ అథారిటీస్ ప్రకటించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘టీమిండియా ప్లేయర్లందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ డోస్‌‌‌‌కు అర్హత ఉన్న ప్లేయర్లందరికీ అక్కడ వ్యాక్సిన్ ఇచ్చేందుకు యూకే అథారిటీస్ ఓకే చెప్పాయి’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.