IndvsAus: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. 1993 నాటి రికార్డు బద్దలు

IndvsAus: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. 1993 నాటి రికార్డు బద్దలు

అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా చరిత్ర సృష్టించింది. 1993లో ఇంగ్లా్ండ్తో జరిగిన మ్యాచులో భారత్ నెలకొల్పిన రికార్డును రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బద్దలు కొట్టింది. తొలి 6 వికెట్ల వరకు ప్రతీ వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి...భారత జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది. 

ఓపెనర్లుగా బరిలోకి దిగిన శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కి 74 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర పూజారా..గిల్తో కలిసి రెండో వికెట్‌కి 113 పరుగులు జతచేశాడు. పూజారా నిష్క్రమించాక..బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ, గిల్ కలిసి మూడో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో కలిసి నాలుగో వికెట్‌కి 64 పరుగుల పాట్నర్ షిప్ను నమోదు చేశారు. అనంతరం శ్రీకర్ భరత్‌తో కలిసి కోహ్లీ ఐదో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లీ నమోదు చేశాడు. ఇక అక్షర్ పటేల్‌తో కలిసి విరాట్ కోహ్లీ  ఆరో వికెట్‌కి ఏకంగా 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 

1993లో ఇంగ్లా్ండ్ టీమిండియా సిరీస్లో భాగంగా ఆంగ్లేయులతో జరిగిన మూడో టెస్టులో భారత్ తొలి 5 వికెట్లకు 50 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేసింది. ఆ మ్యాచ్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన నవజ్యోత్ సిద్ధూ, మనోజ్ ప్రభాకర్ తొలి వికెట్కు 109 పరుగులు జత చేశారు. ప్రభాకర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సచిన్..సిద్దూతో కలిసి రెండో వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సిద్ధూ ఔటయ్యాక బ్యాటింగ్కు వచ్చిన అజరుద్దీన్ సచిన్తో కలిసి మూడో వికెట్కు 193 పరుగుల పాట్నర్ షిప్ నమోదు చేశారు. సచిన్ తర్వాత పర్వీన్ అమ్రేతో కలిసి అజారుద్దీన్ నాల్గో వికెట్కు 50 పరుగులు జోడించాడు. అజారుద్దీన్ ఔటయ్యాక బ్యాటింగ్కు వచ్చిన కపిల్ దేవ్..పర్వీన్ అమ్రేతో కలిసి 100 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఈ రికార్డు బద్దలైంది.