ఆదివారం (నవంబర్ 2) రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్ లు ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇవ్వనున్నాయి. ఇండియా మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తో పాటు మెన్స్ జట్టు టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇండియా మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. టాస్ 1:15 కి వేస్తారు. హోబర్ట్ వేదికగా బెల్లెరివ్ ఓవల్ స్టేడియం మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. మ్యాచ్ జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక లైవ్ టెలికాస్ట్ విషయానికి వస్తే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరుగుతుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి తీరాల్సిందే.
మధ్యాహ్నం 3:00 గంటలకు వరల్డ్ కప్ ఫైనల్:
ఆదివారం (నవంబర్ 2) మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ గ్రాండ్ ఫైనల్ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. 2:30 గంటలకు టాస్ వేస్తారు. వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఇండియా రెండుసార్లు ఫైనల్లో ఓడిపోయింది. సొంతగడ్డపై ఈ సారి ఎలాగైనా ఫైనల్ గెలవాలని గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఈ సారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. 2005, 2017 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వచ్చినా తుది మెట్టుపై బోల్తా పడింది.
►ALSO READ | Shubman Gill: 200 పరుగులు కూడా చేయలేదు.. గిల్‌పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ విమర్శలు
ఫైనల్ మ్యాచ్:
నవీ ముంబై, డివై పాటిల్ స్టేడియం- ఆదివారం (నవంబర్ 2)
టైమింగ్:
మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 2:30 గంటలకు వేస్తారు.
టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మూడు వన్డేలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది
లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా యాప్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
