బోలెడన్నీ మ్యాచ్‌లు.. టీమిండియా తదుపరి షెడ్యూల్ పూర్తి వివరాలు

బోలెడన్నీ మ్యాచ్‌లు.. టీమిండియా తదుపరి షెడ్యూల్ పూర్తి వివరాలు

వన్డే ప్రపంచ కప్‌ 2023 ముగిసింది.. ఇండియా- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ జరుగుతోంది.. టీమిండియా తదుపరి మ్యాచ్‌లు ఏంటి? ఏయే దేశాలతో ఏ సిరీస్‍లు ఉన్నాయి? స్వదేశంలోనా.. విదేశాల్లోనా! అని తల బద్దలయ్యేలా ఆలోచిస్తున్నారా! మేముండగా మీకు ఆ బెంగ అక్కర్లేదు. మీరు చూడాలే కానీ, తీరికలేనన్ని మ్యాచ్‌లు ఉన్నాయి. 

నవంబర్ 23 నుంచి డిసెంబర్‌  03 వరకూ భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఇది ముగిసిన వెంటనే  భారత జట్టు.. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సుమారు నెల రోజుల పాటు జరుగబోయే ఈ టూర్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం కొత్త ఏడాది ప్రారంభంలో సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌ తో మూడు టీ20లు ఆడనుంది. 

ఆపై జనవరి 15 నుంచి మార్చి 11 దాకా భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ ముగిసిన వెంటనే మార్చి చివరి వారంలో ఐపీఎల్‌ 17వ ఎడిషన్(2024) మొదలవుతుంది. అనంతరం ఐపీఎల్‌ ముగిసిన వెంటనే  జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది.

ఇండియా vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ షెడ్యూల్

  • ఫస్ట్ టీ20 (నవంబర్ 23): వైజాగ్
  • రెండో టీ20 (నవంబర్ 26): త్రివేండ్రం 
  • మూడో టీ20 (నవంబర్ 28): గౌహతి 
  • నాలుగో టీ20 (డిసెంబర్ 1): రాయ్ పూర్
  • ఇదో టీ20 (డిసెంబర్ 3): బెంగళూరు

భారత జట్టు సౌతాఫ్రికా పర్యటన(డిసెంబర్‌ 10 - 2024 జనవరి 07)

  • ఫస్ట్ టీ20 (డిసెంబర్ 10): డర్బన్
  • రెండో టీ20 (డిసెంబర్ 12): గబెర్హా
  • మూడో టీ20 (డిసెంబర్ 14): జోహన్నెస్‌బర్గ్
  • ఫస్ట్ వన్డే (డిసెంబర్ 17): జోహన్నెస్‌బర్గ్
  • రెండో వన్డే (డిసెంబర్ 19): గబెర్హా
  • మూడో వన్డే (డిసెంబర్ 21): పార్ల్
  • మొదటి టెస్ట్ (డిసెంబర్‌ 26 - డిసెంబర్‌ 30): సెంచూరియన్
  • రెండో టెస్ట్ (జనవరి 3 - జనవరి 7) : కేప్ టౌన్

ఇండియా vs అఫ్గానిస్తాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్ 

  • ఫస్ట్ టీ20 (జనవరి 11):  మొహాలీ
  • రెండో టీ20 (జనవరి 14): ఇండోర్ 
  • మూడో టీ20 (జనవరి 17): బెంగళూరు

ఇండియా vs ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ షెడ్యూల్ 

  • మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్ 
  • రెండో టెస్ట్ (ఫిబ్రవరి 2 - ఫిబ్రవరి 6): వైజాగ్
  • మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19): రాజ్ కోట్  
  • నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
  • ఇదో టెస్ట్ (మార్చి 7 - మార్చి 11): ధర్మశాల

మార్చి – ఏప్రిల్‌ – మేలలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌

2024 జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌