జట్టుకు భారంగా మారుతున్న రోహిత్ శర్మ.. 5 మ్యాచ్‌ల్లో 4 పరుగులు,4 డకౌట్లు

జట్టుకు భారంగా మారుతున్న రోహిత్ శర్మ.. 5 మ్యాచ్‌ల్లో 4 పరుగులు,4 డకౌట్లు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ల్లో అంతటి ప్రమాదకరమైన ఆటగాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి గత ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏవీ రాలేదు. వన్డే, టెస్టుల్లో రాణిస్తున్న.. టీ20  లు వచ్చేసరికి తడబడుతున్నాడు. ఒకటి రెండు అడపాదపా ఇన్నింగ్స్ లు మినహాయిస్తే ఈ ముంబై బ్యాటర్ పరుగులు చేయడంలో నానా తంటాలు పడుతున్నాడు. ముఖ్యంగా ఛేజింగ్ లో రోహిత్ చివరి అయిదు ఇన్నింగ్స్ లను చూసుకుంటే ఏకంగా నాలుగు సార్లు డకౌటయ్యాడు.
 
ఆఫ్ఘనిస్తాన్ మూడు టీ20 లే సిరీస్ లో భాగంగా రోహిత్ తొలి రెండు మ్యాచ్ ల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. మొదటి మ్యాచ్ లో రనౌట్ అయితే.. రెండో టీ20 లో తొలి బంతికే ఔటయ్యాడు. రెండో టీ20లో బాధ్యత లేకుండా రోహిత్ ఆడిన చెత్త షాట్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ కు ముందు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రోహిత్ రెండు డకౌట్ లతో మొత్తం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. సీనియర్ ప్లేయర్ గా జట్టును ముందుండి నడిపించాల్సిన హిట్ మ్యాన్.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. 

2024 లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. రోహిత్ శర్మను ఈ మెగా టోర్నీకి కెప్టెన్ గా వ్యవహరించనుండడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్ వరుస వైఫల్యాలు టీంఇండియాలో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఐపీఎల్ లో సైతం రోహిత్ దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీలో అదరగొడుతున్నా.. రోహిత్ లాంటి ఆటగాడు ఫామ్ లోకి రావడం టీమిండియాలోకి చాలా కీలకం. జనవరి 17 న బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా మూడో టీ 20 జరగనుంది. మరి ఈ మ్యాచ్ లోనైనా రోహిత్ రాణిస్తాడేమో చూడాలి.