
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ ఈ మ్యాచ్‌లో జ్వరంతోనే బ్యాటింగ్ చేశాడు. దాదాపు 8 గంటల 36 నిమిషాల పాటు క్రీజులో ఉన్న అతను.. కెరీర్‌లో సెకండ్ లాంగెస్ట్ ఇన్నింగ్స్ (364 బాల్స్) ఆడాడు. 2016లో న్యూజిలాండ్‌పై 366 బాల్స్‌లో 211 రన్స్ చేశాడు. 59 రన్స్‌తో ఆట మొదలుపెట్టిన విరాట్ 84 సింగిల్స్, 18 డబుల్స్, రెండుసార్లు ట్రిపుల్ తీసి తన ఫిట్‌నెస్ పవర్‌ను నిరూపించుకున్నాడు. మధ్యలో కొన్నిసార్లు ఫిజియోతో చికిత్స చేయించుకుంటూ కనిపించాడు. అందుకే ఔటై వెళ్తున్న తరుణంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, స్పిన్నర్ మర్ఫితో పాటు ఇతర ప్లేయర్లు దగ్గరకు వచ్చి మరి షేక్‌హ్యాండ్స్ ఇచ్చి అభినందించారు. ఇండియాను గట్టెక్కించాలన్న తెగింపుతో బ్యాటింగ్ చేసిన కోహ్లీ డబుల్ సెంచరీకి 14 రన్స్ దూరంలో నిలిచిపోయినా.. తన టెస్ట్ కెరీర్‌లో గుర్తుండిపోయే గొప్ప ఇన్నింగ్స్ మాత్రం ఆడాడు. 41టెస్టుల్లో గత 41 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేక పోయాడు. ఈ ఫార్మాట్లో వంద కొట్టకుండా ఎక్కువ కాలం ఆడింది కోహ్లీనే. 2012లో సెంచరీ లేకుండా 13 ఇన్నింగ్స్‌లు ఆడాడు.