టెస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో మళ్లీ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌..రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌

టెస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో మళ్లీ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌..రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌: టీమిండియా స్టార్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌.. టెస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో మళ్లీ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఒక్క ర్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగైన అశ్విన్‌‌‌‌‌‌‌‌ 870 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో 9 వికెట్లు తీయడం అశ్విన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది.

ఇప్పటి వరకు నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న స్పీడ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా (847), జోష్‌‌‌‌‌‌‌‌ హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ (847)తో కలిసి సంయుక్తంగా రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. చైనామన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ 15 ప్లేస్‌‌‌‌‌‌‌‌లు జంప్‌‌‌‌‌‌‌‌ చేసి 16వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ (751) ఆరో ర్యాంక్‌‌‌‌‌‌‌‌తో మళ్లీ టాప్‌‌‌‌‌‌‌‌–10లోకి వచ్చాడు.  యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి 8వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ 11 స్థానాలు మెరుగుపడి 20వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ 9వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్స్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో రవీంద్ర జడేజా (444), అశ్విన్‌‌‌‌‌‌‌‌ (322) వరుసగా టాప్‌‌‌‌‌‌‌‌–2లో కొనసాగుతున్నారు.