
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. తన్వి నేగి హీరోయిన్. వి. యశస్వి దర్శకత్వంలో జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. ఇటీవల టీజర్‌ను రిలీజ్ చేసింది. భగవద్గీత శ్లోకంతో ప్రారంభమైన టీజర్‌లో హీరో పాత్రని చాలా ఆసక్తికరంగా ప్రజంట్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, కార్తీక్ వర్మ, నిర్మాత వంశీ, రైటర్ లక్ష్మీ భూపాల హాజరై టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
దీపక్ మాట్లాడుతూ ‘‘ఆర్య’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలైంది. ‘లెజెండ్’లో బాలయ్య గారి చిన్నప్పటి పాత్ర చేశాను. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఇలా ఎంతోమంది గొప్పవారితో పని చేసే అవకాశం వచ్చింది. అది నా అదృష్టం. హీరోగానూ మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులు గెలవాలనుకుంటున్నా’ అన్నాడు.