
బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా మణీంద్రన్ దర్శకత్వంలో డా.లివింగ్‌స్టన్ నిర్మిస్తున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. ఆదివారం ఈ మూవీ టీజర్‌ను సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, బెస్ట్ విషెస్ చెప్పాడు. అనంతరం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘టైటిల్‌కు తగ్గట్టుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ పూర్తయింది.
మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. టీజర్ చూశాక ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది’ అన్నారు. తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమా అవుతుందని హీరో సంజయ్ రావు అన్నాడు. ‘ఇదొక లవ్, యాక్షన్, రొమాంటిక్‌తో పాటు మంచి మెసేజ్‌తో కూడిన సినిమా.
సంజయ్ రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు’ అని నిర్మాత లివింగ్‌స్టన్ అన్నారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి టిక్కెట్ డబ్బుకు మించిన ఆనందాన్ని ఇచ్చే సినిమా ఇదని దర్శకుడు మణీంద్రన్ చెప్పాడు. సంగీత దర్శకుడు గౌర హరితో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.