
‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం’.. ఇంత పవర్‌ఫుల్ మాటలు ఉంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఏర్పడతాయి! నిన్న విడుదలైన ‘బింబిసార’ టీజర్ ఈ డైలాగ్‌తోనే మొదలైంది. బింబిసారపై ఇంతవరకు ఉన్న అంచనాలను తాజా టీజర్ రెట్టింపు చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బార్బేరియన్ కింగ్ బింబిసారుడిగా నటిస్తున్నాడు కళ్యాణ్. ఆ పాత్రలో తన లుక్ టెరిఫిక్‌గా ఉంది. టీజర్ చివర్లో మోడర్న్ యువకుడిగానూ కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు. రెండు క్యారెక్టర్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.