
Mega Layoffs: ఐటీ జాబ్ కొట్టడం, అమెరికా వెళ్లి చదువు పూర్తి చేసి అక్కడే సెటిల్ అవ్వటం వంటివి శతాబ్ధం కిందట నిజమైన కలలు. కానీ ప్రస్తుతం 2025లో కొనసాగుతున్న ఐటీ యుగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పెద్ద కలనే చెప్పుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలు ఈ ఏడాది భారీ ఉద్యోగుల కోతలకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.
లేఆఫ్స్.ఫై ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 130కి పైగా సంస్థలు 61వేల మంది టెక్ ఉద్యోగులను నిర్థాక్షణ్యంగా తొలగించాయని వెల్లడించింది. ఇందులో కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే 6వేల మంది ఉద్యోగులను తొలగించింది. పైగా గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్ వంటి సంస్థలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులకు పాల్పడ్డాయి. ఇక గూగుల్ విషయానికి వస్తే వివిధ డిపార్ట్మెంట్లలో మెుత్తంగా 12వేల మంది ఉద్యోగులను తొలగించింది.
ఇక మరో టెక్ దిగ్గజం అమెజాన్ తన అలెక్సా, కిండిల్, జాక్స్ డిపార్ట్మెంట్లలో వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్ స్ట్రైక్ మెుత్తం ఉద్యోగుల సంఖ్యలో 5 శాతం మందిని ఇళ్లకు పంపించేసింది. ఇక ఐబీఎం సంస్థ లేఆఫ్ చేయబడిన వందల మంది ఉద్యోగులను ఇళ్లకు పంపకుండా కంపెనీ సేల్స్ అండ్ ప్రోగ్రామింగ్ విస్తరణకు ఉపయోగించింది. అలాగే అవసరమైన చోట్ల తప్ప మిగిలిన చోట్ల తగ్గించిన ఉద్యోగుల స్థానంలో ఏఐని ఐబీఎం వినియోగించటం గమనార్హం.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ ఆధారిత కంపెనీలను ఏఐ వెంట పడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న పరిస్థితులతో నెమ్మదించిన ఆదాయాల వృద్ధి, పెరిగిపోతున్న మ్యాక్రో ఎకనమిక్ అస్థిరతలు, సాంప్రదాయ ఉద్యోగ విధానాలను ఏఐ టూల్స్ మార్చివేయటం వంటి అనేక కారణాలు టెక్ రంగంలో మార్పులకు కారణంగా మారుతున్నాయి. ప్రస్తుతం భారతీయ ఐటీ సేవల రంగంలోని దిగ్గజ కంపెనీలు సైతం ఈ పరిస్థితులతో తమ ఉద్యోగులకు హైక్స్ వాయిదా వేయటంతో పాటు కొత్త నియామకాలపై జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయి.