24 గంటల్లోగా వచ్చేయండి..H1B వీసా హోల్డర్స్‌‌‌‌కు టెక్ కంపెనీల సూచన

24 గంటల్లోగా వచ్చేయండి..H1B వీసా హోల్డర్స్‌‌‌‌కు టెక్ కంపెనీల సూచన
  • 14 రోజుల వరకు అమెరికా వదిలి వెళ్లొద్దు
  • హెచ్ 1 బీ వీసా హోల్డర్స్‌‌‌‌కు టెక్​ కంపెనీల సూచన
  • ఎంప్లాయిస్‌‌‌‌కు ఈమెయిల్స్​ చేసిన మెటా, మైక్రోసాఫ్ట్ 

వాషింగ్టన్‌‌‌‌: హెచ్‌‌‌‌1 బీ వీసాలపై ట్రంప్​ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాలోని టెక్​కంపెనీలు అలర్ట్​ అయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్క్ వీసాలపై లక్ష డాలర్ల  రుసుము విధించాలనే కొత్త ప్రణాళిక నేపథ్యంలో హెచ్‌‌‌‌ 1 బీ వీసాదారులు అమెరికా వదిలి వెళ్లొద్దని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు, కంపెనీలు ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన ఉద్యోగులు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని లేదా అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని తెలిపాయి. 

తమ కంపెనీలకు చెందిన హెచ్​1 బీ వీసా హోల్డర్స్​14 రోజుల వరకు అమెరికాను వీడి వెళ్లొద్దని మెటా, మైక్రోసాఫ్ట్ ఆదేశించాయి. అలాగే, దేశం బయట ఉన్న ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు చేరుకోవాలని సూచించాయి. అమెరికాలో తమ భవిష్యత్తు కోసం ఫారిన్ ఎంప్లాయిస్​ ఈ ఆదేశాలను  పాటించాలని కోరాయి. ఈ మేరకు ఉద్యోగులకు ఆయా సంస్థలు అంతర్గత మెయిల్స్‌‌‌‌ పంపినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. 

హెచ్‌‌‌‌-1బీ, హెచ్‌‌‌‌-4 వీసాదారులు 24 గంటల్లోపు అంటే సెప్టెంబర్‌‌‌‌ 21 లోపు ఆలస్యం చేయకుండా అమెరికాకు తిరిగి వచ్చేయాలని మెటా తమ ఎంప్లాయిస్‌‌‌‌కు ఆదేశించింది. దేశంలోనే ఉన్న ఫారిన్​ ఎంప్లాయిస్​వీసా నిబంధనలు అర్థమ్యేవరకూ ఇక్కడే ఉండాలని సూచించింది. దేశంలోకి ఎంట్రీ నిరాకరించకుండా దేశంలోనే ఉండాలని తమ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్​ సూచించింది.