వాట్సాప్.. సైబర్ ఎటాక్ బారిన పడకుండా

వాట్సాప్.. సైబర్ ఎటాక్ బారిన పడకుండా

సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను కూడా వదలడం లేదు. అకౌంట్స్ హ్యాక్ చేసి యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాటి నుంచి తప్పించుకోవాలంటే సోషల్ మీడియా అకౌంట్స్ను  సెక్యూర్ గా ఉంచుకోవాలని టెక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కొన్ని టిప్స్ పాటిస్తే హ్యాకింగ్ నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.

సైబర్ ఎటాక్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని వాట్సప్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ అప్ డేట్లు కూడా ఇస్తుంది. అయితే తరచూ వెబ్ వాట్సాప్ వాడేవారు, వాట్సాప్ మొబైల్ నెంబర్ ను ఇతర వెబ్ సైట్స్ కు ఇచ్చిన వారి అకౌంట్లు సైబర్ ఎటాక్ బారిన పడుతుంటాయి. చిన్న సెట్టింగ్తో హ్యాకర్ల నుంచి తప్పించుకోవచ్చని టెక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇందుకోసం ముందు వాట్సాప్ సెట్టింగ్స్లోని అకౌంట్ కు వెళ్లాలి. అందులో టు స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఎనేబుల్ అనే మెసేజ్ వస్తుంది. ఎనేబుల్పై క్లిక్ చేయగానే ఆరు డిజిట్ల పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. పిన్ సెట్టింగ్ తరువాత ఈ మెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది. వెరిఫికేషన్ చేసుకొని ఓకే నొక్కితే వాట్సాప్ ప్రొటెక్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ టిప్ ద్వారా వాట్సప్ అకౌంట్ హ్యాకింగ్కు గురికాకుండా చూసుకోవచ్చు.