ఇంటర్​తోనే టెకీ జాబ్

ఇంటర్​తోనే టెకీ జాబ్

‘టెక్‌‌బీ’ ద్వారా ఉచిత ట్రైనింగ్​

ఐటీ ఇంజినీర్లుగా జాబ్​ ఆఫర్​

నెలకు పదివేల స్టైపెండ్​.. ఉచిత వసతి

ఇంటర్​తోనే టెక్‌‌ ఇండస్ట్రీలో స్థిరపడాలనుకునే వారికి సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ లిమిటెడ్​. ఉచితంగా ట్రైనింగ్‌‌ ఇచ్చి అనంతరం ఐటీ ఇంజినీర్లుగా ఉద్యోగాలు కల్పించేందుకు గాను ‘టెక్ బీ’ అనే వినూత్న ప్రోగ్రామ్​ను లాంచ్​ చేసింది. దీని ద్వారా 12 నెలల పాటు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి తమ సంస్థలోనే ఎంట్రీ లెవెల్​ జాబ్​ ఆఫర్​ చేస్తుంది. ట్రైనింగ్ మొత్తం నెలకు పదివేల స్టైపెండ్​తో పాటు ఉచిత హాస్టల్​ వసతి కల్పిస్తోంది. చదువుతుంటేనే ఆసక్తిగా ఉంటే.. జాయినయితే ఎలా ఉంటుందో? మరెందుకాలస్యం పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఏమిటీ టెక్​ బీ

వివిధ రకాల టెక్నికల్ కోర్సులలో విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాక పర్సనల్, కమ్యూనికేషన్స్ స్కిల్స్‌‌లో శిక్షణ ఇచ్చి ఐటీ అండ్​ టెక్నాలజీ రంగంలో వారిని ఇండస్ర్టీ రెడీగా తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. తమిళనాడు, ఉత్తరప్రదేశ్​ తర్వాత మన రాష్ర్టంలోనే లాంచ్​చేసిన ఈ ప్రోగ్రామ్​ ద్వారా చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడాలనుకునేవారికి ఆర్థిక సహకారం అందించడం, కెరీర్​ స్కిల్స్​ డెవలప్​ చేయడం వంటి అంశాలు ఇందులో టార్గెట్​గా పెట్టుకున్నారు. ప్రోగ్రామ్​ లాంచ్​ చేసిన తొలి రెండేళ్లలో 700 మంది ఈ కోర్సు ద్వారా కెరీర్​ ఆరంభించారని హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌‌ ప్రెసిడెంట్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎవరు అర్హులు?

మ్యాథమెటిక్స్​ ఒక సబ్జెక్టుగా 2018 లేదా 2019లో ఇంటర్‌‌/తత్సమాన కోర్సు పూర్తిచేసుకున్నవారు దీనికి  అర్హులు. కనీసం 60 శాతం మార్కులు పొందాలి. ఆన్​లైన్​ ఎంట్రన్స్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.  ఎంపికయిన వారికి హెచ్​సీఎల్​హైదరాబాద్​ క్యాంపస్​లో ఉచిత శిక్షణ ఇస్తారు.

ఏమి నేర్పిస్తారు?

12 నెలల ట్రైనింగ్‌‌లో 9 నెలలు క్లాస్‌‌ రూమ్ ట్రైనింగ్, 3 నెలలు ఆన్​ జాబ్​ ట్రైనింగ్​ ఇస్తారు. విజయవంతంగా ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న వారిని కంపెనీలోని అప్లికేషన్, ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్ సపోర్ట్, టెస్టింగ్, క్యాడ్ సపోర్ట్ వంటి ఏరియాల్లోని ప్రాజెక్ట్‌‌లలో నియమిస్తోంది. వీరికి ప్రారంభ వేతనమే ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.

బాండ్​.. రుణం.. హైయర్ స్టడీస్​

అభ్యర్థులు మూడేళ్ల కాంట్రాక్ట్‌‌తో బాండ్ సమర్పించాలి. ట్రైనింగ్ ఇచ్చినందుకు గాను, హెచ్‌‌సీఎల్ టెక్ రూ.2 లక్షల ఫీజు ప్లస్ ట్యాక్స్‌‌లను వసూలు చేస్తుంది. ఫీజులు కూడా విద్యార్థులు కట్టనవసరం లేకుండా వివిధ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని రుణ సదుపాయం కల్పిస్తోంది. హెచ్‌‌సీఎల్‌‌లో ఉద్యోగం పొందిన తొలి ఏడాది నుంచి మాత్రమే ఈ ఫీజు ఈఎంఐ చెల్లింపు ప్రారంభమవుతుంది. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునేవారికి బిట్స్‌‌ పిలాని, శాస్త్ర వంటి ప్రముఖ టెక్నికల్​ సంస్థల నుంచి డిగ్రీ పట్టా పొందే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇందుకు గాను ప్రతి వారాంతంలో హెచ్​సీఎల్​ ఆన్​లైన్​ లో నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయాలి.

వెబ్​సైట్​: www.hcltechbees.com