ఫ్రెండ్స్ను నమ్మి మోసపోయాడు.. ఆఫీసులోనే ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..

ఫ్రెండ్స్ను నమ్మి మోసపోయాడు.. ఆఫీసులోనే ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..

పేరు భువనేష్.. చక్కటి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. టెక్నికల్ అనలిస్ట్ గా మంచి పొజిషన్ లోనే ఉన్నాడు.. వయస్సు 26 ఏళ్లు మాత్రమే.. మంచి భవిష్యత్ ఉంది.. చేస్తున్న ఉద్యోగానికి డిమాండ్ ఉంది.. అయినా ఆత్మహత్య చేసుకున్నాడు.. తాను ఉద్యోగం చేస్తున్న ఐటీ కంపెనీలోని.. 10వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.. వివరాల్లోకి వెళితే..

ఐటీ ఉద్యోగం చేస్తున్న భువనేష్.. తన స్నేహితులను విపరీతంగా నమ్మాడు.. ఓ రకంగా గుడ్డిగా నమ్మాడు. వాళ్లు చెప్పినట్లు 10 లక్షల రూపాయలను బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకున్నాడు. ఆ 10 లక్షలతోపాటు తన దగ్గర ఉన్న డబ్బును కలిపి.. ఫ్రెండ్స్ చెప్పినట్లు.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టాడు. అది కూడా తన అకౌంట్ నుంచి కాకుండా స్నేహితుల అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేశాడు. ఆరు నెలలుగా స్నేహితుల నుంచి రెస్పాన్స్ రాలేదు.. అడిగితే మొత్తం 10 లక్షల రూపాయలు పోయాయని.. రూపాయి కూడా రాలేదని.. స్టాక్ మార్కెట్ లో నష్టం వచ్చిందని చెప్పారు.

ఇదే సమయంలో డబ్బులు లేక 10 లక్షల రూపాయల బ్యాంక్ అప్పుకు ఈఎంఐ చెల్లించటం లేదు.. దీంతో వాళ్ల నుంచి ఒత్తిడి వస్తుంది. డబ్బులు పోయాయనే బాధ కంటే.. ఫ్రెండ్స్ మోసం చేశారనే బాధతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు భువనేష్.. విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్లు ఏమీ అనలేదు.. సొంత ఇల్లు ఉంది.. దాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ అప్పు తీర్చేద్దాం.. మిగతా అప్పులు కూడా కట్టేద్దాం.. నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకో.. వచ్చే జీతంతో ఇల్లు విడిపించుకుందాం అని ఎంతో చక్కగా చెప్పారు. 

తాను మోసపోయాననే ఫీలింగ్.. ఇంట్లో వాళ్లకు ఏమీ చేయకపోగా.. చేసిన అప్పులకు ఉన్న సొంతింటిని కూడా తాకట్టు పెట్టటం ఏంటీ అనే తీవ్ర మనోవేదనతో.. ఆత్మహత్య చేసుకున్నాడు భువనేష్.. చెన్నైలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందర్నీ కలిచివేస్తుంది. పోలీస్ స్టేషన్ దగ్గర భువనేష్ తండ్రి మాటలు అందర్నీ కంట తడిపెట్టిస్తున్నాయి. ఫ్రెండ్స్ చేసిన మోసం అంటూ బంధువులు చెబుతున్నారు.. నవంబర్ 11వ తేదీ ఈ ఘటన జరిగింది...