హైదరాబాద్, వెలుగు: ఎనర్జీ రంగంలో టెక్ సేవలు అందించే అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ టెక్నిప్ఎఫ్ఎంసీ హైదరాబాద్‌లో రూ. 1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ డబ్బుతో సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలను కంపెనీ ఏర్పాటు చేయనుంది. టెక్నిక్ ఎఫ్ఎంసీ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సెంటర్లో 2,500 జాబ్స్, మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో మరో 1,000 జాబ్స్ క్రియేట్ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కే టీ రామారావు తన ట్వీట్లో వెల్లడించారు.
ఏలియంట్ నుంచి 9 వేల జాబ్స్...
కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోని ఏలియంట్ గ్రూప్ హైదరాబాద్‌లో తన ఆపరేషన్స్‌ను భారీగా విస్తరించనుంది. ఈ కంపెనీ కొత్తగా 9 వేల జాబ్స్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఏలియంట్ గ్రూప్ సీఈఓ ధవల్ జాదవ్‌తో మంత్రి, ఇతర అధికారులు సమావేశమయ్యారు.
