నిట్‌లో మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఉత్సవాలు

నిట్‌లో మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఉత్సవాలు

హనుమకొండ/కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్​ లో మూడు రోజుల పాటు కొనసాగిన టెక్నోజియాన్​ వేడుకలు ఆదివారం ముగిశాయి. దేశంలోని వివిధ సాంకేతిక విద్యాసంస్థల నుంచి తరలివచ్చిన స్టూడెంట్లు​తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఇంజీనియస్​ థీమ్ తో సాగిన ఉత్సవాల్లో విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు అందరినీ ఆలోచింపజేశాయి. మూడో రోజు మైండ్స్​ ఇన్​ ద మెషీన్,​ వెహికల్​ డెమాన్ స్ట్రేషన్, పోస్టర్​ స్పెక్ట్రమ్, బిడ్​ క్రాఫ్ట్, మైండ్​ గ్రైండ్, వరంగల్ ట్రేడింగ్​ రింగ్  తదితర ఈవెంట్లు నిర్వహించారు.

రోబోటిక్, నిట్ ​ విద్యార్థులు తయారు చేసిన స్పర్ధక్​  వెహికిల్​  ప్రదర్శన ఆకట్టుకుంది.  మూడో రోజు ఉత్సవాలకు ఇస్రో సైంటిస్ట్​ డాక్టర్​ టీఎన్  సురేశ్​ కుమార్​ చీఫ్​ గెస్ట్​ గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఐఐటీ, ఎన్ఐటీల స్టూడెంట్లు​ స్పెస్​ రిసెర్చ్​లు చేయాలని సూచించారు. ఆ దిశగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక అభివృద్ధిలో కమ్యూనికేషన్​దే ప్రధాన పాత్ర అన్నారు. స్పేస్​ రిసెర్చ్​ గురించి అవగాహన పెంచుకోవడానికి ఇస్రోకు రావాలని  స్టూడెంట్లను ఆయన  ఆహ్వానించారు. కాగా, ఈ మూడు రోజుల సాంకేతిక ఉత్సవంలో రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.