పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ఔటర్ రింగ్ రోడ్ సైకిల్ ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు టీన్ షెడ్లు నిర్మించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న  HMDA అధికారులు కొరడా జులిపించారు. తెల్లవారుజామున నార్సింగి పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చి వేయించారు HMDA అధికారులు.

కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే.. ఎంతటి వారైనా సరే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు.