సఫాయి కార్మికులకు టైమ్​కు జీతాలియ్యాలి: తీన్మార్ మల్లన్న

సఫాయి కార్మికులకు టైమ్​కు జీతాలియ్యాలి:  తీన్మార్ మల్లన్న

ఘట్ కేసర్, వెలుగు: సీఎం కొడుకు అమెరికాలో సఫాయి పనులు చేసి తెలంగాణలో మంత్రి అవ్వొచ్చు.. కానీ రాష్ట్రంలో సఫాయి కార్మికులకు సమయానికి జీతాలు ఇవ్వకపోవడమేంటని క్యూ న్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్న విమర్శించారు. 38 రోజులుగా ఘట్​కేసర్​లో సఫాయి కార్మికులు నిరాహార దీక్ష చేస్తుండగా గురువారం తీన్మార్ మల్లన్న సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆర్యవైశ్య భవన్​లో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు.  

రాష్ట్ర ఖజానా దివాలా తీయగా.. మంత్రి మల్లారెడ్డి తన సొంత నిధులతో సీసీ రోడ్లు, కుల సంఘాలకు భవనాలు, కులానికి ఒక గుడి, గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు నిర్మాణం చేయిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కార్మిక సంఘాల జేఏసీ నేతల ఆధ్వర్యంలో మండలంలోని 11 గ్రామ పంచాయితీల శానిటేషన్ కార్మికులకు బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించారు.