జూన్ ​2 నుంచి పాదయాత్ర చేస్త

జూన్ ​2 నుంచి పాదయాత్ర చేస్త

గజ్వేల్, వెలుగు: తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి జూన్​2 నుంచి ప్రజా పాదయాత్ర ప్రారంభిస్తానని తీన్మార్​ మల్లన్న ప్రకటించారు. ప్రజా సేవ చేయాలనుకునే వారు తమ ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రలు జరుగుతున్నాయని, తాను మాత్రం ప్రజలను చైతన్యం చేయటానికే పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. ఇకపై కేసీఆర్​ను తాను ఒక్కమాట కూడా అననని, రాజకీయాలు చేయనని, ప్రజల్ని చైతన్యం చేసే లక్ష్యంతో పని చేస్తానని తెలిపారు. గురువారం గజ్వేల్​లో ఆయన 7,200 సమావేశం నిర్వహించారు. అన్ని హంగులతో గజ్వేల్​లో 100 పడకల హస్పిటల్​ కట్టినట్టు చెప్తున్న కేసీఆర్..​ తన పంటి నొప్పి చికిత్స కోసం స్పెషల్​ ఫ్లైట్​ వేసుకుని ఢిల్లీకి ఎందుకు పోతున్నాడని మల్లన్న ప్రశ్నించారు. పేదల పిల్లలు సర్కారు బడుల్లో చదువుతుంటే సీఎం మనవడు ప్రైవేట్​ స్కూల్లో చదువుతున్నాడని, అందరి పిల్లలూ సర్కారు బడుల్లోనే చదువుకునేలా వాటిని తీర్చిదిద్దడానికే 7,200 ఉద్యమమని చెప్పారు. సమావేశం తర్వాత కేసీఆర్​ ఫాంహౌస్​​వైపు వెళ్లేందుకు మల్లన్న ప్రయత్నించారు. అయితే పాములపర్తి చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. తాను కొండపోచమ్మసాగర్​ రిజర్వాయర్​ను చూడటానికి వెళుతున్నానని చెప్పినా వినలేదు.మల్లన్నను పోలీసు వాహనంలో ఎక్కించి ఔటర్ రింగ్​ రోడ్డు వరకు తీసుకొచ్చి వదిలేశారు.