వింత వ్యాధి: ఈమెకు మందు అలవాటు లేదు.. కానీ బాడీలో మద్యం ఉత్పత్తి అవుతది

వింత వ్యాధి: ఈమెకు మందు అలవాటు లేదు.. కానీ బాడీలో మద్యం ఉత్పత్తి అవుతది

మద్యం ఎక్కువగా తాగే వారి ఆరోగ్యం పాడవుతోందనేది తెలిసిందే. చాలా మంది మందుకు బానిసై హెల్త్‌‌ను పాడు చేసుకుంటూ ఉంటారు. అందుకే మందు తాగొద్దని డాక్టర్లు సూచిస్తుంటారు. కానీ ఇక్కడో మహిళ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మందు తాగకున్నా ఆమెకు మత్తు వస్తోంది. సదరు మహిళ పేరు సారా లిఫబర్. యూఎస్‌కు చెందిన సారాకు మందు తాగే అలవాటు లేదు. అయినా ఆమెకు మత్తుగా అనిపిస్తోందట. రీసెంట్‌‌గా సారాకు బ్రీత్‌అనలైజర్ టెస్టులు చేయగా అందులో ఆరుసార్లు ఓవర్ లిమిట్ చూయించింది. దీంతో ఆమె డాక్టర్లను కలిసింది.

సారా హెల్త్ కండీషన్ చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. తొలుత సారాను చూసి ఆమె ఆల్కహాలిక్ అని వైద్యులు అనుకున్నారు. కానీ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె ఆటో బ్రెవెరీ సిండ్రోమ్ (ఏబీఎస్) అనే వింత వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. సారా శరీరంలో నుంచి ఇథనాల్ అనే రసాయనం ఎక్కువ మోతాదులో విడుదలవుతోందని, అది ఆమె రక్తంలోకి వెళ్తుండటంతో సారాకు మత్తుగా అనిపిస్తోందని తేల్చారు. సారా లివర్ పూర్తిగా దెబ్బతిందని, ఆమెకు వెంటనే లివర్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆమె ఈ వ్యాధితో బాధపడుతోందని, ప్రస్తుతం సారాకు యాంటీఫంగల్ డ్రగ్ ఇస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు.