పాట్నా: బిహార్‌లోని అతి ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన మహువాలో లాలూ పెద్ద కొడుకు, జన్ శక్తి జనతా దళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది ఆర్జేడీ నుంచి ఆయనను ఆరేండ్ల పాటు సస్పెండ్ చేశారు. దీంతో ఆర్జేడీ నుంచి బయటకు వచ్చిన తేజ్ ప్రతాప్.. జేజేడీ పార్టీని స్థాపించారు. తాజా ఎన్నికల్లో మహువా నుంచి బరిలో నిలిచారు. ఎన్డీయే తరపున ఎల్జేపీ అభ్యర్థిగా పోటీచేసిన సంజయ్ కుమార్ సింగ్ చేతిలో తేజ్‌ప్రతాప్ ఓడిపోయారు. సంజయ్‌కు 87,641 ఓట్లు రాగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేశ్ కుమార్ రౌషన్కు 42,644 ఓట్లు వచ్చాయి. 35,703 ఓట్లతో తేజ్‌ప్రతాప్ మూడో స్థానంలో నిలిచారు.
