ఓ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లా షో హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడాన్ని  ఎంజాయ్ చేశా: తేజ సజ్జా 

ఓ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లా షో హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడాన్ని  ఎంజాయ్ చేశా: తేజ సజ్జా 

హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిరాయ్ లాంటి చిత్రాల్లోని సూపర్ హీరో పాత్రలతో మెప్పించిన యువహీరో తేజ సజ్జా.. ఇప్పుడు సూపర్ హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాడు. ‘ది ట్రెయిటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ రియాలిటీ షో తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా షో విశేషాలను, తన ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తేజ సజ్జా ఇలా షేర్ చేసుకున్నాడు.  

మిరాయ్ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు ఈ షో కోసం నన్ను సంప్రదించారు. అప్పటికే దీని గురించి తెలుసు.  కనుక చాలా త్వరగా ఓకే చెప్పా. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇది చాలా పెద్ద హిట్ ఫ్రాంచైజ్. 20కి పైగా దేశాల్లో, 25కి పైగా భాషల్లో చేశారు. హిందీలో కరణ్ జోహార్ చేశారు. ఈ షో ఫార్మాట్ ఎంతో స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది  ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశా.  

మొత్తం 10 ఎపిసోడ్లు. 20 మంది కంటెస్టంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 11 రోజులు షూట్ చేశాం. హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినప్పటికీ ఇది కూడా సినిమాలో పోషించిన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలో ఉంటుంది. హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నా పాత్ర కీలకం.  ఇంకా చెప్పాలంటే క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వారానికి 3 ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తాయి. తొలి మూడు ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూశాక ఈ షోపై ఆడియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పూర్తి క్లారిటీ వస్తుంది. మొత్తం సభ్యుల్లో ఎవరు ట్రెయిటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎవరు ఇన్నోసెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనేది ఆడియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రివీల్ అవుతుంది.  ట్రెయిటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరనేది ఇన్నోసెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపెట్టడం,  అలా తమపై అనుమానం రాకుండా ట్రెయిటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాగ్రత్త పడటం ఇందులో కీలకం.  ఎవరిని నమ్మాలి,   ఎవరిని అనుమానించాలి,  ఎవరు ట్రెయిటర్స్,  ఎవరు ఇన్నోసెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే కోణంలో ఈ షో థ్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంది.  

తెలుగులో వచ్చిన ఏ షోతో దీనికి పోలిక ఉండదు. చాలా కొత్త ఫార్మాట్. ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలో రియల్ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఉంటుంది. ఇందులో పాల్గొనే కంటెస్టంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సెలబ్రిటీగా ఉండటం ప్రయారిటీ కాదు. గేమ్ ఆడటం ముఖ్యం. మానిపులేట్ చేస్తూ,  నమ్మిస్తూ ముందుకెళ్లగలగాలి. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన వారికి కోటి రూపాయలు ప్రైజ్ మనీ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది.  ఇక ‘జాంబీ రెడ్డి 2’ ఇటీవలే షూటింగ్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాం’’.