Teja Sajja : ప్లేస్ ఒకటే..ఇది కదా హనుమాన్ విజయం

Teja Sajja : ప్లేస్ ఒకటే..ఇది కదా హనుమాన్ విజయం

చిన్న సినిమా అంటూనే..పాన్ ఇండియా సినిమాగా వచ్చేసింది హనుమాన్. ప్రశాంత్ వర్మ్ (Prasanth Varma)  డైరెక్షన్, తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్...కు కోట్లు ఖర్చుపెట్టినా రానంత పబ్లిసిటీ వచ్చింది.

చిన్న సినిమాకు..థియేటర్లు దొరకడం లేదంటూ..భీభత్సంగా సినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది. నార్త్ మార్కట్ ను నమ్ముకుని..సంక్రాంతి బరిలోకి దిగిన హనుమన్ తో  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ్ సక్సెస్ అయ్యాడు. అందుకు ఒక ఉదాహరణగా సినిమా చూసిన ఆడియాన్స్ కు విజువల్ ఎఫెక్ట్స్ తో పూనకాలు ఎలా వస్తున్నాయో..టాక్ వింటేనే అర్ధమైపోతుంది. 

లేటెస్ట్గా సినిమా గ్రాండ్ సక్సెస్ కి పర్ఫెక్ట్ ఉదాహరణతో హీరో సజ్జ పోస్ట్ చేశాడు. అయితే..వరంగల్ లో ఓ థియేటర్ యాజమాన్యం..హనుమాన్ రిలీజ్ కు ముందు 'తేజ హనుమాన్' భారీ కటౌట్ ను తీసి పక్కన పెట్టారు. అంతేకాదు..కాస్తయినా విలువ ఇవ్వకుండా..ఈ చిన్న సినిమా మకు అక్కర్లేదు పక్కకు పడేసారు.

ఇపుడు అదే థియేటర్ నిర్వాహకులు తిరిగి హనుమాన్ మూవీ కటౌట్ను నిలబెట్టారు. ఇక దీనిపై హీరో తేజా స్పందిస్తూ..ప్లేస్ ఒకటే..ఈ సినిమా నిలబడుతుంది. మమ్మల్ని నిలబెడుతుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో అసలైన హనుమాన్ విజయం ఇదంటూ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.