
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న యాక్షన్ అడ్వంచరస్ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. బుధవారం టీజర్‌ను విడుదల చేయబోతున్నామని, ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ గ్లింప్స్ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని తెలియజేశారు.
ఇందులో సూపర్ యోధగా నటిస్తున్నాడు తేజ. ప్రస్తుతం ముంబైలోని చారిత్రాత్మక గుహలలో షూటింగ్ జరుగుతోంది. తేజతో పాటు లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనుండగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2డి, 3డి ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.