‘కమిట్ మెంట్’ సెన్సార్ పూర్తి

‘కమిట్ మెంట్’ సెన్సార్ పూర్తి

టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్ర‌స్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'కమిట్ మెంట్' ఇందులో తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య  శ్రీనివాస్, అభయ్ రెడ్డి. వీరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూసర్స్ బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి మాట్లాడుతూ.. "మా మంచి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క నటీనటులు, టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు" అని తెలిపారు. 


న‌టీనటులు : తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి, సీమర్ సింగ్, అన్వేషి జైన్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్, అభయ్ రెడ్డి, తన్కిష్క్ జైన్, రాజా రవీంద్ర తదితరులు.
నిర్మాణం : ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ 
ప్రొడ్యూసర్స్ : నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.చెన్న 
మ్యూజిక్ డైరెక్టర్ : నరేష్ కుమారన్    
డి.ఓ.పి : సాజీశ్ రాజేంద్రన్, నరేష్ రాణా
ఎడిటర్ : ప్రవీణ్ పూడి 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : ద్వారకేష్ 
లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలకి 
డైలాగ్స్ : సంతోష్ హర్ష, కార్తీక్, అర్జున్, కళ్లి కళ్యాణ్
కాన్సెప్ట్ : ఈశ్వర్ గాయం 
ఆర్ట్ : సుప్రియ బత్తెపాటి
లిరిక్స్ : పూర్ణ చారి ,గాంధీ 
కొరియోగ్రఫీ : హరికిరణ్  
కో- డైరెక్టర్ : మెహర్ 
పీ.ఆర్.ఓ : శ్రీపాల్ చొల్లేటి