డేవిడ్‌‌‌‌ నోబుల్‌‌‌‌ రిలేస్‌‌‌‌–2026 అథ్లెటిక్స్‌‌‌‌ మీట్‌‌‌‌లో తేజస్విన్‌‌‌‌ శంకర్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌

డేవిడ్‌‌‌‌ నోబుల్‌‌‌‌ రిలేస్‌‌‌‌–2026 అథ్లెటిక్స్‌‌‌‌ మీట్‌‌‌‌లో తేజస్విన్‌‌‌‌ శంకర్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌ తేజస్విన్‌‌‌‌ శంకర్‌ డెకాథ్లాన్‌‌‌‌ సీజన్‌‌‌‌ను విజయంతో ఆరంభించాడు. శుక్రవారం రాత్రి టెక్సాస్‌‌‌‌లో జరిగిన డేవిడ్‌‌‌‌ నోబుల్‌‌‌‌ రిలేస్‌‌‌‌–2026 అథ్లెటిక్స్‌‌‌‌ మీట్‌‌‌‌లో శంకర్‌‌‌‌ 7947 పాయింట్లతో టాప్‌‌‌‌లో నిలిచి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గాడు. అయితే గతేడాది పోలెండ్‌‌‌‌లో తాను నెలకొల్పిన 7826 పాయింట్ల నేషనల్‌‌‌‌ రికార్డును శంకర్‌‌‌‌ అధిగమించినా కొత్త రికార్డుగా నమోదు చేయలేదు. వరల్డ్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ నిబంధనల ప్రకారం గాలి వేగం పరిమితికి మించి ఉండటంతో ఈ పెర్ఫామెన్స్‌‌‌‌ను (7947)ను పరిగణనలోకి తీసుకోలేదు. 

వరల్డ్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ప్రకారం.. డెకాథ్లాన్‌‌‌‌ రికార్డును పరిగణనలోకి తీసుకోవాలంటే 100 మీటర్ల పరుగు, లాంగ్‌‌‌‌ జంప్‌‌‌‌, 110 మీటర్ల హర్డిల్స్‌‌‌‌ విభాగాల్లో సగటు గాలి వేగం సెకన్‌‌‌‌కు +2.0 మీటర్లకు మించకూడదు. కానీ శంకర్‌‌‌‌ పాల్గొన్న 100 మీటర్స్‌‌‌‌ రన్‌‌‌‌లో +4.7 మీ/సె, లాంగ్‌‌‌‌జంప్‌‌‌‌లో +4.5 మీ/సె, 110 మీ. హర్డిల్స్‌‌‌‌లో +2.5 మీ/సెకన్లుగా గాలి వేగం నమోదైంది. దీనివల్ల సగటు గాలి వేగం +3.9 మీ/సెకన్‌‌‌‌గా తేలడంతో ఈ రికార్డును పరిగణనలోకి తీసుకోలేదు.