తెలంగాణలో కరోనా వ్యాక్సిన్స్ ఖాళీ..

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్స్ ఖాళీ..

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డోసులు నేటితో ఖాళీ కానున్నాయి. ఈ విషయాన్ని హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 28 డోసులు ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 45 సంవత్సరాలు నిండినవారందరికీ వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ఫస్ట్ వేవ్‌లో కన్నా సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా గాలి ద్వారా, డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ద్వారా కూడా వ్యాపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అనుమానమున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. దాంతో రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. కాగా.. శనివారం రాత్రి వరకు 2.70 లక్షల వాక్సిన్ డోసులు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.