మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 18వ తేదీ నుంచి 10 వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు  విద్యాశాఖ ప్రకటిం చింది. ఏప్రిల్ 2వ తేదీ  వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. 

గురువారం (డిసెంబర్ 28) ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేశారు. తాజాగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేసింది విద్యాశాఖ. టెన్త్, ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని  ఇటీవల విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.