
మొదటి స్థానంలో కర్నాటక..
నాలుగో ప్లేస్‌లో ఏపీ
హైదరాబాద్, వెలుగు: సోలార్ రూఫ్‌టాప్ ర్యాకింగ్‌లో రాష్ట్రానికి రెండో స్థానం దక్కింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను సరళ్ గ్రేడింగ్, ర్యాంకింగ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 72.2 స్కోరింగ్‌తో ‘ఏ ప్లస్ ప్లస్’ గ్రేడింగ్‌తో రాష్ట్రం సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 78.8 స్కోర్‌తో ‘ఏ ప్లస్‌ప్లస్’ గ్రేడింగ్‌తో కర్నాటక ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకుంది. 67.9 స్కోరింగ్‌తో గుజరాత్ మూడో స్థానంలో , 66.1 స్కోరింగ్‌తో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచాయి. సోలార్ రూఫ్ టాప్ అమలులో తీసుకువస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న విధానాలు, పురోగతి, పెట్టుబడి అవకాశాల గుర్తింపు, ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం.. వీటన్నింటినీ బేరీజు వేసుకొని కేంద్ర సాంప్రదాయేతర ఇంధనశాఖ ర్యాకింగ్‌లు ప్రకటిస్తూ ఉంటుంది.